డుంబ్రిగూడ మండలంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు చట్టువా–కండ్రుమ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చెడ్డ శేషుప్రవీణ్ (21) అక్కడికక్కడే మృతి చెందగా, డిప్పల తాజేశ్వరరావు (20) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వంతాల అరవింద్ (22)ను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.