డిర్రపల్లి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి

హుకుంపేట మండలం జర్రకొండ పంచాయితీ పరిధిలోని డిర్రపల్లి గ్రామ ప్రజలు రోడ్డు సదుపాయం లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి వెళ్లాలంటే పెద్ద గెడ్డ దాటి వెళ్లాల్సి రావడం, వర్షాకాలంలో గెడ్డ పొంగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆసుపత్రికి చేరలేక అగచాట్లకు గురవుతున్నారు. గ్రామస్తులు తమ గ్రామానికి రహదారి మంజూరు చేసి, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్