డుంబ్రిగూడలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఆదివారం డుంబ్రిగూడ మండల కేంద్రంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించారని, తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని సుబ్బారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్