అల్లూరి జిల్లా ఏజెన్సీ అడవుల్లో లభించే స్వచ్ఛమైన తేనెకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కొండలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సేకరించే ఈ తేనె ఔషధ గుణాలు, సహజమైన రుచితో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. సరైన మార్కెటింగ్, విక్రయ వేదికలు కల్పిస్తే ఈ అడవి తేనెకు మరింత ఆదరణ పెరిగి, గిరిజనులకు మంచి ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.