ఫేషియల్ అటెండెన్స్‌తో ఉపాధి కూలీల అవస్థలు

డుంబ్రిగూడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీలు ఫేషియల్ అటెండెన్స్ విధానం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ హాజరు నమోదు కోసం ఉపయోగించే మొబైల్ అనువర్తనం బుధవారం నుంచి సరిగా పనిచేయకపోవడంతో కూలీలు పనిస్థలాల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. సకాలంలో ఫేషియల్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో హాజరు పడక, పనిదినాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్