అల్లూరి జిల్లాలోని కూర్మన్నపాలెం వద్ద కిలో పరశురాం అనే వ్యక్తిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తుప్పల్లోకి తీసుకెళ్లి సెల్ ఫోన్, నగదు దోచుకున్నట్లు ఏసీపీ భవ్య రెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన క్రైమ్ సీఐ శ్రీనివాసరావు, అగనంపూడి ప్రాంతానికి చెందిన మణికంఠ, దుర్గ ప్రసాద్‌లను చాకచక్యంగా అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.