ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ వినతి

డుంబ్రిగూడ MEO సుందర్రావుని యూటీఎఫ్ నాయకులు సోమవారం కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో వర్క్ అడ్జస్ట్మెంట్, సింగిల్ టీచర్ పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయుల నియామకం, డిప్యూటేషన్‌లు, నెలవారీ సమీక్ష సమావేశాలు, ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయం, క్లస్టర్ టీచర్ల సమర్థ వినియోగం వంటి అంశాలను పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని MEO సుందర్రావు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్