అరకులోయలో శుక్రవారం వైసీపీ నేతలు 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.