భీమిలి: కిశోర బాలికలకు జీవన నైపుణ్యాలపై అవగాహన

ఐసీడీఎస్ భీమిలి ప్రాజెక్టు పరిధిలోని బోడమెట్టపాలెంలో 'కిశోరి వికాసం' కార్యక్రమంలో బాలికలకు జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, ప్రొటెక్షన్ ఆఫీసర్ చంద్రశేఖర్ బాలికలు తమ బలాలు, బలహీనతలు తెలుసుకొని లక్ష్యాలను సాధించాలని సూచించారు. భీమునిపట్నంలోని SOS చిల్డ్రన్స్ విలేజ్‌లో కూడా యువా గ్రూపు సభ్యులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సోషల్ వర్కర్ నరేంద్ర, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. బాలికలకు వీడియో ప్రదర్శన, కలర్ చార్టుల ద్వారా భవిష్యత్ ప్రణాళికలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్