భీమిలి: లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధురవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ‘బ్లాక్ డే’ నిర్వహించారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కార్మికులు నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ, దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులను బానిసలుగా మార్చేలా ఈ కొత్త కోడ్‌లు ఉన్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ఈ విధానాలను వెంటనే ఉపసంహరించుకుని, పాత చట్టాలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్