భీమిలి: TDP ఆవిర్భావ వేడుకల్లో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

భీమిలి మండలం లక్ష్మీపురం పంచాయితీ పరిధిలో ఆదివారం జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పార్టీకి చెందిన ఇరువర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తి, అది కొట్లాటగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్