భీమిలి: యువతకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గంటా

నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం జాబ్ మేళాలు నిర్వహిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. పీఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన 'భీమిలి మెగా జాబ్ మేళా'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేశ్ చొరవతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో భీమిలికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. 135 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు దాదాపు 10 వేల మంది యువత హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్