భీమిలి: డ్యాన్స‌ర్ పండు మాస్ట‌ర్‌కు తీవ్ర‌గాయాలు

విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ఒక కార్యక్రమానికి హాజరై బుధవారం వేకువజామున తిరిగి వెళ్తుండగా ప్రముఖ డాన్సర్ పండు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆనందపురం వద్ద జాతీయ రహదారిపై పండు ప్రయాణిస్తున్న కారును రోడ్డు పక్కన ఆపిన సమయంలో, వెనుక నుండి వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో డాన్సర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి.

సంబంధిత పోస్ట్