ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 1 వ వార్డు బాలాజీనగర్ పాచిపేటలో రూ. 57 లక్షలతో నిర్మించనున్న రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014-19 మధ్యలో రూ. 4, 700 కోట్లతో భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని వివరించారు.