తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పల నరసింహ రాజు బుధవారం అనారోగ్యంతో పాండ్రంగి గ్రామంలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన భీమిలి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా సేవలందించారు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.