భీమిలి: జీవరాశుల దాహార్తిని తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత

సమస్త జీవరాశినీ కాపాడటమే నిజమైన మానవత్వమని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి అన్నారు. ఆదివారం మధురవాడలోని అయోధ్య నగర్‌లో ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశుపక్ష్యాదులకు నీటి వసతి కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో నీరు అందక ఏ జీవి అంతరించిపోకుండా ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు అరణ్య మిత్రులుగా మారి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా జీవించడం ద్వారానే ప్రకృతిని కాపాడుకోగలమని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్