భీమిలి పరిధిలోని సంగివలస శ్రీ పోలమాంబ, కొత్త అమ్మవారి ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, భక్తులు మెచ్చుకునేలా మూడు గుళ్లను అభివృద్ధి చేయాలని, వివాదాలకు దూరంగా ఉండి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఆదాయ వనరులు పెంచి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ట్రస్టు సభ్యులకు సూచించారు. కొత్తగా నియమితులైన ట్రస్టు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా, సారిపల్లి శ్రీనును ఆలయ చైర్మన్‌గా ప్రకటించారు.