విశాఖలో బిమ్‌స్టెక్ కాంక్లేవ్ ప్రారంభం

రెండవ బిమ్‌స్టెక్ కాంక్లేవ్ 2025 విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారంప్రారంభమైంది. కేంద్ర పోర్టులు, నౌకా, జల రవాణా శాఖ మంత్రి శరబానంద సోనోవాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, థాయ్‌లాండ్ దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కాంక్లేవ్‌లో బంగాళాఖాత తీర దేశాల మధ్య సముద్ర రవాణా అభివృద్ధి, పరస్పర సహకారం, వాణిజ్య సంబంధాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్