ఉత్సాహంగా సాగిన బోట్ రేస్ పోటీలు

విశాఖ ఉత్సవ్ లో భాగంగా మంగమారిపేట వద్ద జరిగిన బోట్ రేస్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించిన ఈ పోటీల్లో 90 మంది మత్స్యకారులు పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 31న ఆర్కే బీచ్ లో బహుమతులు అందజేస్తారు. పోటీలను వీక్షించడానికి తీరానికి జనం పోటెత్తారు.

సంబంధిత పోస్ట్