భీమిలిలో హరే కృష్ణ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ప్రారంభం

భీమిలిలోని కృష్ణా నగర్‌లో ఆదివారం 'హరే కృష్ణ వైకుంఠం' ఆధ్వర్యంలో గో ఆధారిత వ్యవసాయ క్షేత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ నిష్కించన భక్తదాస ఈ క్షేత్రాన్ని ప్రారంభించారు. ఈ క్షేత్రం గో ఆధారిత వ్యవసాయంపై పరిశోధనలు చేయడం, రైతులకు అవసరమైన శిక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రకృతి వ్యవసాయ నిపుణులు భూపతి రామకృష్ణంరాజు, రొంపిచర్ల సింగరాచార్య, శ్రీమతి గంట శారద, గుత్తికొండ మాధవి, వేముల పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్