విశాఖలో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్: 20 ఎకరాల భూమి కేటాయింపు

విశాఖపట్నాన్ని అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎండాడ హిల్‌లో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్యాంపస్ ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడితో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తవుతుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీఐఐసీ రూ. 79 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. 10,000 సీటింగ్ సామర్థ్యంతో గ్రీన్ క్యాంపస్‌గా దీనిని తీర్చిదిద్దనున్నారు.

సంబంధిత పోస్ట్