పెట్రోల్ కొరతతో వాహనదారులు ఆందోళన.. బంకుల వద్ద భారీ క్యూలు

భీమిలి, తగరపువలస, ఆనందపురం, వేములవలస, పెద్దపాలెం, ఎల్.వి పాలెం, దుక్కవానిపాలెం ప్రాంతాల్లో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న కొమ్మాది పెట్రోల్ బంక్ వద్ద భారీగా వాహనాలు క్యూలలో నిలిచిపోయాయి. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డిజిల్ కోసం రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్