విశాఖ: భారత్–న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ వీక్షించిన ఏసీఏ నేతలు

విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ టీ20 సిరీస్‌లో భాగంగా భారత్–న్యూజిలాండ్ మధ్య 4వ టీ20 మ్యాచ్‌ను ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో ఐసీఏ ప్రతినిధి చాముండేశ్వరినాథ్ వీక్షించారు. మ్యాచ్‌కు ముందు స్టేడియంలో తాగునీరు, శౌచాలయాలు, వైద్య, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్