విశాఖపట్నంలోని జోడగుల్లపాలెం సముద్ర తీరానికి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. అతని చేతిపై "జగదీశ్", పొట్టపై "అమ్మ" అనే పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడి వివరాలు తెలిసినవారు ఆరిలోవ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని శాంతిభద్రతల ఎస్సై వై. కృష్ణ శుక్రవారం కోరారు.