సాగరతీరం మంగళవాం రంగుల హరివిల్లుగా మారింది. హోలీ పండుగను పురస్కరించుకుని విశాఖవాసులు ఉత్సాహంగా రంగుల కేళిలో మునిగితేలారు. ఉదయం నుంచే నగరంలోని ప్రధాన వీధులు, అపార్ట్‌మెంట్‌లు , బీచ్ రోడ్డు ప్రాంతాలు యువత కేరింతలతో మారుమోగాయి. ముఖ్యంగా ఆర్కే బీచ్, ఋషికొండ ప్రాంతాల్లో పర్యాటకులు, స్థానికులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని పలు రిసార్టులు, హోటళ్లలో ఏర్పాటు చేసిన రెయిన్ డాన్స్, డీజే ఈవెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.