విశాఖ: కూటమి ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కింది: ఎమ్మెల్సీ

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో విమర్శించారు. సూపర్‌ సిక్స్ హామీల అమలును కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని, నిధుల కేటాయింపుల్లో కేవలం కాగితాలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లన్నీ ప్రజలను మోసం చేసేలాగే ఉన్నాయని, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్