విశాఖ‌: పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం తగదు

తమిళనాడు రాజకీయాలతో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రతి రాష్ట్రానికి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయని, కేవలం రాజకీయ కక్షతోనే కొందరు పవన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన పోరాట పటిమతో 100 శాతం విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారని, ఇలాంటి అర్థరహితమైన ట్రోల్స్‌తో ఆయన ప్రభావాన్ని తగ్గించలేరని బొలిశెట్టి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్