విశాఖ: కాలుష్యాన్ని నివారించలేం.. నియంత్రించవచ్చు

విశాఖలో శనివారం పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయినా, పకడ్బందీ చర్యలతో నియంత్రించవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో పర్యావరణ హితమైన విధానాలను అవలంబించాలని కోరారు.

సంబంధిత పోస్ట్