విశాఖ పోర్ట్ అథారిటీ ప్రతిష్టాత్మక ‘గ్రీన్‌టెక్ సీఎస్ఆర్ అవార్డ్స్ 2026’లో వరుసగా రెండో ఏడాది కూడా హెల్త్‌కేర్ ప్రమోషన్, స్కిల్ డెవలప్‌మెంట్ విభాగాల్లో గోల్డ్ అవార్డులను కైవసం చేసుకుంది. అనాథ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, వాటర్ ఏటీఎంల ఏర్పాటు, ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు, మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ ఘనత సాధించిన సిబ్బందిని పోర్ట్ చైర్మన్ డా. ఎం. అంగముత్తు, డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి అభినందించారు.