విశాఖ నగరంలోని పంజాబ్ హోటల్ జంక్షన్ సమీపంలో గల శిష్టకరణం ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం నూతన సంవత్సర ప్రత్యేక సంచికను భీమిలి నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బలివాడ రామ్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడుతున్నాయని వారు ప్రశంసించారు. ప్రతి ఏడాది సంక్రాంతి ముందు ఈ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ మానాపురం సురేష్ కుమార్ తెలిపారు.