కర్నూలు ఎంపీ బైరెడ్డి శబరి శనివారం విశాఖ గీతం వైద్యకళాశాలలో జరిగిన ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య రంగంలో రేడియాలజీ సంబంధిత అత్యాధునిక విధానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రేడియాలజిస్ట్‌ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది రేడియాలజిస్ట్‌లు పాల్గొన్నారు.