విశాఖ‌: అమెరికా అధ్య‌క్షుడికే ర‌క్ష‌ణ లేదు: కేఏ పాల్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు తాను వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లోనే ఉన్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఈ ఘటనతో హోటల్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. తాను అమెరికా వచ్చినప్పుడల్లా ఈ హోటల్‌లోనే ఉంటానని, ఇలాంటి భయానక పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేని పరిస్థితి రావడం దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్లే ఇలాంటి హింసాత్మక వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. యుద్ధాలు ఆపి, ప్రపంచ శాంతికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్