విశాఖ: బీచ్‌రోడ్డులో మహిళ మృతదేహం కలకలం

విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న సముద్ర తీరానికి శుక్రవారం ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకురావడంతో స్థానికంగా కలకలం రేగింది. తీరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మెరైన్, మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలి గుర్తింపు, మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిందా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్