విశాఖ‌: నీటిపై యోగాస‌నాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో డా. యార్లగడ్డ గీతా శ్రీకాంత్ 'జల యోగా' ప్రదర్శనతో అబ్బురపరిచారు. ఆమె సుమారు గంట పాటు నీటిపై తేలుతూ 30 రకాల క్లిష్టమైన ఆసనాలను ప్రదర్శించారు. పద్మాసనం, నౌకాసనం వంటి ఆసనాలతో పాటు, శరీరంలో దీపాలను ఉంచుకుని నీటిపై తేలుతూ ఆమె వేసిన జలాసనం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. జల యోగా వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, మానసిక ఒత్తిడి తగ్గుతుందని డా. గీతా శ్రీకాంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్