విశాఖ‌: రుషికొండ తీరంలో కనులవిందుగా 'యోగాంధ్ర'

విశాఖలోని రుషికొండ సాగరతీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా, ఆరోగ్య సంబరంలో నగరానికి చెందిన వివిధ రంగాల అధికారులు, యోగా సాధకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైస్ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి జ్యోతి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు యోగ అవసరమని ఈ సందర్భంగా వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్