విశాఖ‌: లడ్డు కల్తీ పాపానికి వైసీపీకి మూల్యం తప్పదు

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులు ప్రమాదకరమైన 'మోనో గ్లిజరాయిడ్స్' రసాయనాలను వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని జనసేన వీరమహిళలు మండిపడ్డారు. విశాఖపట్నంలోని సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే, వైసీపీ నాయకులు అవహేళన చేయడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై గౌరవం లేదని, గతంలో అంతర్వేది, రామతీర్థం ఘటనలే దానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆవులు, డైరీలు లేని సంస్థల నుండి కల్తీ నెయ్యి సేకరించి మహా అపచారం చేశారని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని వారు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్