విశాఖపట్నం క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నిర్వహిస్తున్న ‘శాప్ లీగ్స్’ లో భాగంగా ఏప్రిల్ 2న విశాఖ వేదికగా జలక్రీడలు జరగనున్నాయి. సముద్ర తీరంలో నిర్వహించనున్న ఈ ఈవెంట్లలో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. నగరాన్ని క్రీడా హబ్‌గా మార్చే దిశగా శాప్ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జలక్రీడల ప్రియులు, పర్యాటకులు ఈ పోటీలను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.