బుచ్చయ్యపేట మండలంలో 196 జీవిత భాగస్వామి పెన్షన్లను స్థానిక ఎమ్మెల్యే శుక్రవారం పంపిణీ చేశారు. వీటిని సద్వినియోగపరుచుకోవాలని ఆయన లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ జీవిత భాగస్వామి పెన్షన్ ను అందుకున్న తరుణం లో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.