గజపతినగరం వాసికి గ్రూప్–2 లో ఘన విజయం

చోడవరం మండలం గజపతినగరం గ్రామానికి చెందిన మోహన్ భార్య లోచన, గ్రూప్-2 పరీక్షలో ప్రతిభ కనబరిచి స్కూల్స్ ఎడ్యుకేషన్ విభాగం, అమరావతిలో ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆమె విజయంపై గజపతినగరం గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువ నాయకులు కనిశెట్టి రామునాయుడు, కనిశెట్టి మచ్చిరాజు, శరగడం రామునాయుడు తదితరులు అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్