చోడవరం సి డి వి ఎం ఫౌండేషన్ సద్భావ టీం ఆధ్వర్యంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఆది గణపతి 63 అడుగుల మట్టి వినాయక విగ్రహ మహోత్సవ కార్యక్రమంకి సంబంధించిన ఆది గణపతి పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొప్పాక రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వయంభు విఘ్నేశ్వర ఆలయ ప్రాంగణంలో ఎంపీపీ గాడి కసులమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ పి సాంబ తదితరులు ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు.