బుచ్చయ్యపేట: పేకాట స్థావరాలపై బుచ్చయ్య పేట పోలీసుల దాడి

బుచ్చయ్య పేట పోలీస్ స్టేషన్ పరిధిలో, రాజాం గ్రామ సమీపంలో ఎస్సై శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీస్ బృందం సోమవారం ప్రత్యేక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అక్రమంగా జూదం ఆడుతున్న 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 3,660 నగదు, 52 కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతర చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్