బుచ్చయ్య పేట; పవన్ దృష్టికి మండల సమస్యలు

బుచయ్యపేట మండలంలోని పలు సమస్యలను జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని మండల జనసేన నాయకులు శనివారం నిర్ణయించారు. గున్నేంపూడి నుండి పెద మదీన, రాజాం నుండి తురకలపూడి, కొండాకొమ్ము నుండి తిమ్మన్నపాలెం, పెద మదీన నుండి చిన మదీన వరకు రహదారుల నిర్మాణం, అలాగే వడ్డాది, విజయరామరాజు పేటల వద్ద బ్రిడ్జిల నిర్మాణం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు సమస్యలను ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో డి ఎస్ నాయుడు, గోవిందరావు, దొండా సాయి, శ్రీ గుండు గణేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్