వడ్డాదిలోని పాత సినిమా హాలు వద్ద, నాలుగు రోడ్ల కూడలిలో కొలువై ఉన్న రెండు మోదకొండమ్మ ఆలయాల వద్ద మంగళవారం గ్రామ పండుగ నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఆలయాలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నేల వేషాలు, తప్పెట గుళ్ళు కోలాటాలతో అమ్మవారికి ఘటాల ఊరేగింపు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.