చోడవరం;కేంద్ర బడ్జెట్లో ఉపాధికి కోత

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే. గోవిందరావు మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలను తగ్గించేలా ఉన్నాయని తెలిపారు. 2026-27 బడ్జెట్‌లో రూ. 9,692 కోట్లు ప్రకటించారని, అయితే ఏడాదికి 125 పని దినాలు కల్పిస్తామని చెప్పి, వంద రోజులకు సరిపడా నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. 125 రోజులు పని కల్పించాలంటే లక్ష 30 వేల కోట్లకు పైగా కేటాయించాల్సి ఉండగా, కేవలం 9 వేల కోట్లే కేటాయించారని పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన విబిజి రామ్ జి చట్టం ప్రకారం, ఈ కేటాయింపుల్లో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఖర్చు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్