చోడవరం: యూరియా అధికంగా వాడొద్దు

యూరియా వాడకం తగ్గించుకోవల్సిందిగా వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. పంట ఏపుగా పెరిగేందుకు యూరియాను అధికంగా వాడితే భూసారం తగ్గడంతో పాటు, భవిష్యత్తులో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నుంచి వెలువడే అమ్మోనియాతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులపై దృష్టి పెట్టాలని వ్యవసాయ పరిశోధకులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్