చోడవరం: ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం జెడ్. కొత్తపట్నం గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీశ్రీశ్రీ షిర్డీ సాయి బాబా వారి ఆలయం లో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గురువారం తెల్లవారుజాము నుండి పురోహితులు వేపా ధర్మ ఫణి ఈశ్వరి ఆధ్వర్యంలో భక్తులు చేత స్వయంగా పంచామృతాలతో విశేష పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆలయ ప్రాంగణం లో సహస్ర దీపాలంకరణ జరగనున్నది.

సంబంధిత పోస్ట్