చోడవరంలో అతి పురాతనమైన శ్రీ కేశవ స్వామి వారి తెలుగు కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి అంకురార్పణతో ఉత్సవాలు మొదలయ్యాయి. స్వామి వారి కళ్యాణోత్సవాలు గురువారం రాత్రి నిర్వహించినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.