చోడవరం: ఘనంగా లక్ష్మీ గణపతి హోమం

చోడవరం శ్రీ స్వయంభు విగ్నేశ్వర స్వామి ఆలయంలోనూ రావికమతం మండలం టి అర్జాపురం శ్రీ బాల వరసిద్ధి వినాయక ఆలయంలోను సోమవారం లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చోడవరంలో ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతి, అర్జాపురంలోబ్రహ్మశ్రీ గుంటూరు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆషాడ మాసం కృష్ణ పక్షం లోకకళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనేకమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని హోమాన్ని తిలకించారు.

సంబంధిత పోస్ట్