హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో శనివారం జరిగిన "గురువందనం అవార్డ్స్ 2025" కార్యక్రమంలో, రోలుగుంట హైస్కూల్లో ఉపాధ్యాయురాలు మల్టిపుల్ టాలెంటెడ్ టీచర్ పి. వి. ఎం. నాగజ్యోతికి గురువందనం అవార్డు లభించింది. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.