చోడవరం: గాంధీ గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో 'గాంధీ గ్రామ పంచాయతీలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం' మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దత్తత గ్రామంలో ఈ శిబిరం నిర్వహిస్తారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్, సర్పంచ్ గాడి అప్పారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంపు నిర్వహించి చాలా ఏళ్లు అయ్యిందని, ఇలాంటి క్యాంపులు విద్యార్థుల్లో జాతీయతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్